Take a fresh look at your lifestyle.

జై బాబు,జై భీమ్,జై సంవిధాన్,అభియాన్ కార్యక్రమం

మంథని, ముద్ర : ఏఐసీసీ,టీపీసిసి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచన మేరకు శుక్రవారం మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్,అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.గుంజపడుగు,ఉప్పట్ల, పోతారం గ్రామాల వీధుల్లో తిరుగుతూ జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ యొక్క సందేశం ప్రజలకు వివరించరు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు..మహాత్మాగాంధీ ,అంబేద్కర్,రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం అని అన్నారు.జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల, ఎస్సీ సెల్ నాయకులు,ఎస్టీ సెల్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.