మహదేవపూర్, ముద్ర :
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.సుమారు ₹90 వేల కోట్ల నుండి లక్ష కోట్ల వరకు ప్రజా ధనాన్ని వెచ్చించిన ఈ ప్రాజెక్టులో జరిగిన నష్టం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ భారీ వైఫల్యానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వమే ప్రాథమిక బాధ్యత వహించాలని వారు స్పష్టం చేశారుకాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ విధ్వంసంపై రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం మరియు సిఐటియు ప్రతినిధి బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు ప్రతినిధి బృందం మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం (సరస్వతి), పార్వతి (సుందిళ్ళ) బ్యారేజీలతో పాటు మేడవరం పంపింగ్ హౌస్‌ను క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడ కుంగిపోయిన పియర్లు మరియు దెబ్బతిన్న గేట్లను పరిశీలించింది. ఈ బృందంలో నాయకులు పి. సుదర్శన్, బి. వెంకట్, సాయిబాబు, నున్నా నాగేశ్వరరావు మరియు సిఐటియు నాయకుడు మధు తదితరులు పాల్గొన్నారు.
.