Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా దుర్గామాత బోనాల పండగ

  • పాల్గొన్న పోచారం, ఇతర ప్రముఖులు.

బాన్సువాడ,ముద్ర:బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని సంగమేశ్వర కాలనీలోని వెలసిన శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ మాత ఆలయంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరిగింది.ఆలయం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ తీర్చిదిద్దగా, పాత బాన్సువాడలోని అన్ని కులాల వారు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు బోనాలను అమ్మవారి సమర్పించి నైవేద్యాలు, ఓడి బియ్యం సమర్పించారు.డీజే ఆటపాటలతో బోనాల జాతర కన్న పండుగ జరిగింది.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ను ఘనంగా సన్మానించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి, సరస్వతి ఆలయ ధర్మకర్త పోచారం శంభు రెడ్డి, ఎన్ డి సి సి బి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, సింగిల్ విండోచైర్మన్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు కాసుల రోహిత్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి గణేష్, మాజీ మార్కెట్ చైర్మన్ పాత బాలకృష్ణ, మాజీ జెడ్పిటిసి కొత్తకొండ భాస్కర్,కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి మాసాని అశోక్ రెడ్డి మాసాని రవీందర్ రెడ్డి,అంజిరెడ్డి మోహన్ నాయక్ పి. శ్రీధర్ టిఆర్ఎస్ నాయకులు జుబేర్ గణేష్ బిజెపి నాయకులు గార్గే శ్రీనివాస్, శంకర్ గౌడ్ కోణాల గంగారెడ్డి, పైడిమల్ లక్ష్మీనారాయణ, కనకదుర్గమాత ఆలయ గౌరవ అధ్యక్షులు మామిండ్ల రాజు కార్యనిర్వాహన అధ్యక్షులు అమ్బిల్పురాజు కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి విటల్ ఆలయ కార్యవర్గ సభ్యులు మొగులయ్య ఇందూరు శ్రీనివాస్ కిషన్ విటల్ శివ సంపత్ అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.