- ప్రభుత్వం కేటాయించిన భూములు రద్దు.
- రాయదుర్గులో కేటాయించిన మూడున్నర ఎకరాల స్వాధీనానికి ఆదేశం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) కు హైకోర్టు షాకిచ్చింది. ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను శుక్రవారం రద్దు చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్ లోని రాయదుర్గ్ లో ఐఏఎంసీ కేంద్రాన్ని అప్పటి సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. సదరు న్యాయసేవా సంస్థకు రాయదుర్గ్ లో మూడున్నర ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రూ.350 కోట్ల విలువైన ఈ భూముల కేటాయింపులు అక్రమంగా జరిగాయంటూ, వాటిని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి.ఈ పిటిషన్లను విచారించిన హైకోర్ట్ పిటిషన్ దారుల వాదనతో ఏకీభవించి, ఏఐఎంసీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.