నేడు జిల్లా కేంద్రంలో 3 చోట్ల హిందూ సమ్మేళన కార్యక్రమాలు
ముద్ర, నారాయణ పేట :
నారాయణపేట జిల్లా కేంద్రంలోని 3 వేరు వేరు ప్రాంతాల్లో ఏప్రిల్ 3 సాయంత్రం 5 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందూ సమ్మేళన సమితి శ్రీ మార్కండేయ బస్తి ఆధ్వర్యంలో సరాఫ్ బజార్ బసవేశ్వర స్వామి దేవాలయ వద్ద నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య వక్తగా కూర జయదేవ్ ( ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్) అలాగే శ్రీగిరి అష్టలక్ష్మి క్షేత్రం వ్యవస్థాపకులు పూజ శ్రీ ఆచార్య కృష్ణానంద స్వామి హాజరుకానున్నారు. అలాగే మహంకాళి బస్తి ఆధ్వర్యంలో స్థానిక అంబ భవాని దేవాలయం వద్ద జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య వక్త గా అన్నదానం సుబ్రహ్మణ్యం ( ప్రాంత కార్యకారిణి), నేరేడుగం సిద్ధ లింగేశ్వర మఠం పూజ శ్రీ పంచమసిద్ద లింగ మహాస్వామి రానున్నారు. శ్రీరామ బస్తి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య వక్తగా పత్తి కొండ రాము( విభాగ కార్యవాహ) అలాగే బిజ్వార్ అంబాత్రేయ క్షేత్రం వ్యవస్థాపకులు ఆదిత్య పరాశ్రీ స్వామి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. హిందూ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించి ఆయా బస్తీలలో ఇప్పటికే కరపత్రాల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. బస్తీల నుంచి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక తను పెంపొందించే భజన సంకీర్తనలతో కోలాట ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలతో హిందూ సమ్మేళన కార్యక్రమానికి హాజరయ్యేలా హిందూ సమ్మేళన సమితి ఉత్సవ కమిటీ కార్యాచరణ రూపొందించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అన్ని బస్తీల నుంచి మహిళలు, యువత, విద్యార్థులు, మేధావులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా హిందూ ధర్మ పరిరక్షణకై కార్యక్రమానికి తరలిరావాలని కోరారు.