Take a fresh look at your lifestyle.

స్నేహితుని కుటుంబానికి జెర్కోని రాజు ఆర్థిక సాయం

  • రూ. 50 వేలు సాయం అందజేసిన బీఆర్ఎస్ నేత.

ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: తన స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు జేర్కొని రాజు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తన స్నేహితుడైన మంకాల రాజు ఇటీవల మృతిచెందాడు. మృతుని కుటుంబాన్ని సోమవారం పరామర్శించి పిల్లల చదువులకు నిమిత్తం రూ. 50 వేల ఆర్ధిక సహాయం అందజేశారు. తన స్నేహితుడైన రాజు మృతి చెందడం ఎంతో బాధాకరమని, ఆయన మృతి తనను ఎంతో కలిచివేసిందని చెప్పారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. రాజు పిల్లల పైచదువులకు తనవంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అగంత్ కుమార్, గణేష్, నూకల అశోక్, ప్రవీణ్, శ్రీకాంత్, భాను, జలంధర్ నాయక్, సాయి, కిశోర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.