Take a fresh look at your lifestyle.

వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు

ముద్ర, శేరిలింగంపలి:
మే 10 న తెలంగాణ కు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయుచున్న సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభను నియోజకవర్గం నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలి కోరుతూ నియోజకవర్గ వ్యాప్తంగా చేపడుతున్న ప్రచార కార్యక్రమాలలో భాగంగా వాల్ రైటింగ్ ప్రారంభించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడూ

భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మూడవసారి ప్రధాన మంత్రి గా బాధ్యతలు చేపట్టాక పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు మరియు తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చేందుకు తొలిసారి హైదరాబాద్ విచ్చేయుచున్న సందర్భంగా మే 10 వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబడుతున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలలో భాగంగా వాల్ రైటింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రూ. 7,823 కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు వసంతి యాదవ్, రామరాజు, కేశవులు, మని భూషణ్, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు సాగర్, రమేష్, పద్మా, కాంచన కృష్ణ, జితేందర్, ఆకుల లక్ష్మణ్, అరుణ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.