Take a fresh look at your lifestyle.

‘ఉజ్జయినీ’ బోనాలకు రండి

  • సీఎం కు ఉత్సవ కమిటీ ఆహ్వానం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే నెల 13న నిర్వహించతలపెట్టిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని ఉత్సవ కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, అర్చకులు సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు ఆశీర్వచనం అందించిన మహంకాళి ఆలయ అర్చకులు ఆయనకు ఆహ్వాన పత్రిక అందించారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం, ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లను సీఎంకు వివరించారు. రాష్ట్ర ప్రతిష్టకు అద్దంపట్టే ఈ ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి.. విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి.. ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.