ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ బల్దియా ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన గెలిచిన మంచాల శ్రీకాంత్ యాదవ్ ఒకే ఒక్కడిగా మిగిలాడు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి సన్నిహితుడుగా పేరున్న శ్రీకాంత్ యాదవ్ కాంగ్రెస్ పక్షాన టికెట్ ఆశించాడు. కానీ చివరి క్షణంలో అధిష్టానం ఆయన టికెట్ ఖరారు చేయకపోవడంతో బి ఆర్ ఎస్ లోకి చేరాడు. అయితే పార్టీలో చేరి గెలుపొందిన ఒకే ఒక్క బిఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన నిలిచిపోయాడు.