చిలుకూరు, ముద్ర:
మార్చి నెలలో జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 70% మార్కుల తోటి 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తహసిల్దార్ రెమిడాల ధ్రువ కుమార్, మండల అభివృద్ధి అధికారి గిరిబాబు లు అన్నారు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాధికారి ఎం గురవయ్య అధ్యక్షతన సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశంలో చిలుకూరు మండల తహసిల్దార్ రెమిడాల ధ్రువ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి గిరిబాబు లు పాల్గొని మాట్లాడుతూ చిలుకూరు మండలాన్ని ఉత్తీర్ణత శాతంలో జిల్లాలో
టాపర్ గా నిలిచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు, ప్రతి విద్యార్థి 70% మార్కులుతో విజయం సాధించేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏ, కరుణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, శివకుమారి, హనుమంతరావు, గౌసుద్దీన్, కృష్ణారెడ్డి లు పాల్గొన్నారు…