Take a fresh look at your lifestyle.

మార్చి 7 నుంచి అఖిల భారత బజరంగ్ దళ్ శిక్షణ శిబిరం

 

ముద్ర, కుషాయిగూడ:

మార్చి 7 నుంచి 14 వరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సాయి దామంలో అఖిలభారత బజరంగ్ దళ్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.ఇందుకు సంబందించిన ఏర్పాట్లు గురించి శుక్రవారం కుషాయి గూడ లోని సరస్వతి శిశు మందిర్ లో సమీక్ష కార్యక్రమం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా అఖిలభారత బజరంగ్ దళ్ జాతీయ అధ్యక్షులు కిషన్ ప్రజాపతి కుషాయిగూడకు విచ్చేసి శిబిర ఏర్పాట్లపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కుషాయిగూడ బస్ స్టాప్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆయన సందర్శించారు. అనంతరం కుషాయిగూడ శివాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేటి యువత ధర్మ మార్గంలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో హిందు దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ‘లవ్ జిహాద్’ పేరుతో హిందూ యువతులను లక్ష్యంగా జరుగుతున్న సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత్ బజరంగ్ దళ్ సంయోజక్ కుమారస్వామి, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులు రమేష్ బాబు, తెలంగాణ రాష్ట్ర బజరంగ్ దళ్ సంయోజక్ శ్రీకాంత్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.