Take a fresh look at your lifestyle.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రెడీ చేయండి.. బ్యాలెన్స్ వర్క్స్ సత్వరమే పూర్తి కావాలి.. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

ముద్ర ప్రతినిధి, కరీంనగర్:

గాంధీనగర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్స్ సత్వరమే పూర్తి చేసి ఇండ్లను సిద్ధం చేసి ఉంచాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

గురువారం కరీంనగర్ లోని గాంధీ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బ్లాక్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇండ్లకు సంబంధించిన పెండింగ్ పనులు ఏమేమి ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యాలెన్స్ వర్క్ ను వెంటనే చేపట్టి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించారు. ఈ పనులపై ఆర్ అండ్ బి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. బ్లాక్ ల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అన్ని రకాలుగా సంసిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహ చారి, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.