Take a fresh look at your lifestyle.

రాజకీయ ఉత్కంఠ.. జగిత్యాలలో కేటీఆర్, జీవన్ రెడ్డి భేటీ

రాష్ట్రంలో సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు…
కేసీఆర్ సీఎం అయితేనే పేదల ముఖాలపై చిరునవ్వు…
నికార్సైన సీనియర్ నాయకులకు కాంగ్రెస్లో అవమానం…
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానం…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను దాటవేయుతకు డైవర్షన్ పార్టీ చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ నాయకులతో కలిసి కేటీఆర్ వచ్చి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు పట్టణ శివారులోని ధరూర్ వద్ద కేటీఆర్ కు ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీ ద్వారా జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అనంతరం జీవన్ రెడ్డితో కేటీఆర్ కొద్దిసేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ సూచన మేరకు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు జగిత్యాలకు వచ్చానన్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్లో విశేషమైన సేవలు చేస్తే, అలాంటి నాయకులను అవమానిస్తున్నారని అన్నారు. 2014 సమయంలో పార్టీలోకి రావాలని అప్పుటి సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తే, ఒక్క నిబద్ధతగల నాయకుడిగా జీవన్ రెడ్డి టిఆర్ఎస్లోకి రాలేదని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి, కెసిఆర్ ల అనుబంధం ఈనాటిది కాదని, 2014లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత బోర్నపల్లి బ్రిడ్జి కోసం నిధుల కేటాయించాలని జీవన్ రెడ్డి కోరితే అప్పటికప్పుడే రూ.75 కోట్లు మంజూరు చేశారని, అలాగే అసెంబ్లీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారని తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు రైతులను మరోవైపు నిరుద్యోగులను ఇలా అన్ని రంగాల వారిని మోసం చేసిందని, రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ ని గెలిపించి కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నా… జీవన్ రెడ్డి

గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో మానసిక శోభకు గురయ్యానని, అవమానాలు భరించలేక కాంగ్రెస్కు రాజీనామా చేసి బయటకు వచ్చానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ని గద్ద దించే సత్తా గలిగిన టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎన్టీఆర్ ప్రభుత్వంతోపాటు చెన్నారెడ్డి, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్ ప్రభుత్వాలను చూశానని, కానీ గడిచిన రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి రివర్స్ అయిందన్నారు. రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే నయమని ప్రజలు అనుకుంటున్నారని, మళ్లీ కేసీఆర్ పాలన ఉంటేనే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు.

కేటీఆర్ పర్యటనలో అపశృతి…

కేటీఆర్ పర్యటన సందర్భంగా జీవన్ రెడ్డి నివాసం వద్ద జరిగిన భారీ జన సమ్మర్ధంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో క్యూ న్యూస్ రిపోర్టర్‌కు సాయి కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తోటి విలేకరులు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరిలించి చికిత్స అందించారు. అలాగే పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

గాయపడిన రిపోర్టర్ ను పరామర్శించిన మంత్రి అడ్డూరి…

కేటీఆర్ జగిత్యాల పర్యటన లో రిపోర్టర్‌ సాయి కుమార్ కాలు ఫ్యాక్చర్ కాగా మీడియా మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ హాస్పిటల్ కు వెళ్లి రిపోర్టర్ సాయి ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు. మంత్రి వెంట జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య, నాయకులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.