Take a fresh look at your lifestyle.

ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం వేడుకలు

ముద్ర,అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచంపేట్ మండల కేంద్రంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులు జెండాలు ఎగురవేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి లు గా విచ్చేసిన సిపిఐ అచ్చంపేట నియోజకవర్గ కార్యదర్శి పెరుముల గోపాల్ ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్, ఏఐటీయూసీ జెండా ఎగరవేసిన ఆటో వర్కర్స్ యూనియన్ అచ్చంపేట అధ్యక్షుడు ఎండి మహబూబ్ అలీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మెహబూబ్ అలీ మాట్లాడుతూ 138 సంవత్సరాల కింద అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మిక వర్గం ఎనిమిది గంటల పని దినము కై ఉద్యమిస్తే అక్కడి నిరంకుశ ప్రభుత్వం కార్మికుల పై వివక్ష రహితంగా కాల్పులు జరిపి వేలాది మంది కార్మికులను పొట్టన పొట్టనబెట్టుకున్నది అనీ ఈ సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా శ్రమ జీవుల ఐక్య దినంగా కార్మికవర్గం పల్లె నుంచి ఢిల్లీ దాకా మే డే ఉత్సవాలు భారత కమ్యూనిస్టు పార్టీ, మరియు కార్మికులు జరుపుకుంటున్నారన్నారు.అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం కార్మిక వర్గం పట్ల దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దళితులను పెట్టుబడిదారులను బహుళజాతి సంస్థల ప్రయోజనాల కొరకు పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ 139వ మే డే ఉత్సవాలు సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆటో వర్కర్స్ యూనియన్ ఎండి పురాన్, భాష, ఎస్కే నిరంజన్ ,ఎండి అక్బర్ ,అన్వర్ పాషా ,పరమేష్, కాజా, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.