Take a fresh look at your lifestyle.

సెబీకి రెంటోమోజో డీఆర్‌హెచ్‌పీ

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

 

హోమ్ ఫర్నిచర్, గృహోపకరణాల ఆన్‌లైన్ రెంటల్, సబ్‌స్క్రిప్షన్ వేదిక రెంటోమోజో… తమ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ను ఆదివారం సెబీకి సమర్పించింది. రెంటోమోజో భారత్‌లో ఫర్నిచర్, గృహోపకరణాల కోసం టెక్నాలజీ ఆధారిత, ఫుల్ స్టాక్ డైరెక్ట్ టు కన్జూమర్ (డీ2సీ) ఆన్‌లైన్ రెంటల్, సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫాంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది అతిపెద్ద ఆన్‌లైన్ రెంటల్, సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫాంగా ఉంది. 2025లో సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా  సంఘటిత హోమ్ ఫర్నిచర్, గృహోపకరణాల రెంటల్ సెగ్మెంట్లో (వాటర్ ప్యూరిఫయర్స్ మినహా) 42శాతం–47శాతం మార్కెట్ వాటాతో మార్కెట్ లీడరుగా ఉంది. ఈ ఆఫర్‌లో రూ. 150 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ కింద 2,83,99,567 షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో షేరు ముఖ విలువ రూ. 1గా ఉంటుంది. 2025 సెప్టెంబర్ 30 నాటికి 22 నగరాల్లో 2,27,511 లైవ్ సబ్‌స్క్రయిబర్స్, 21 గిడ్డంగులు సుమారు. 4,44,486 చ.అ. వేర్‌హౌసింగ్ స్పేస్‌తో విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ కలిగి ఉంది.

 

దేశ వ్యాప్తంగా 67 ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్‌…

ఆన్‌లైన్ ఇంటర్‌ఫేస్, దేశ వ్యాప్తంగా 67 ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్‌తో (2025 సెప్టెంబర్ 30 నాటికి) ఆమ్ని-చానల్ ప్లాట్‌ఫాంగా కంపెనీ పని చేస్తోంది. 7,28,773 లైవ్ ప్రోడక్టుల పోర్ట్‌పోలియోతో ఫర్నిచర్, గృహోపకరణాల సరళతరమైన సబ్‌స్క్రిప్షన్ సేవలు అందిస్తోంది. కాగా 11 టచ్‌పాయింట్ కన్జూమర్ లైఫ్‌సైకిల్ మోడల్ (ఆర్డర్, రిస్క్ మదింపు, డెలివరీ, ఇన్‌స్టాలేషన్, నెలవారీ వసూళ్లు, రీలొకేషన్, రిపేర్లు, అప్‌గ్రేడ్స్, సబ్‌స్క్రిప్షన్ కాంట్రాక్ట్ ట్రాన్స్‌ఫర్లు, రివర్స్ లాజిస్టిక్స్, రిఫండ్‌లు) ప్రాతిపదికన కంపెనీ పని చేస్తోంది. 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆరు నెలల కాలానికి మరియు 2025, 2024, 2023 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 83.91శాతం, 82.82, 86.43, 91.07శాతం ఆక్యుపెన్సీ రేటుతో పటిష్టమైన వనరుల వినియోగ సామర్థ్యాలను, ఆదాయార్జన సామర్థ్యాలను ప్రదర్శించింది. ఇక 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం రూ. 176.61 కోట్లుగా, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 265.96 కోట్లుగా నమోదైంది. అలాగే పన్నుల అనంతరం లాభం (రీస్టేటెడ్) 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో రూ. 61.38 కోట్లుగా, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 43.11 కోట్లుగా నమోదైంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాలు, వడ్డీల చెల్లింపునకు (పాక్షికంగా లేదా పూర్తిగా); తమ గిడ్డంగులు ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్ లీజు అద్దెలు లేదా లైసెన్సు ఫీజుల చెల్లింపునకు,ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. అలాగే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా ఆఫర్ చేయబడే ఈక్విటీ షేర్లు, బీఎస్ఈ లిమిటెడ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేయబడతాయి.గీతాంష్ బమానియా ఈ కంపెనీకి ప్రమోటరుగా ఉండగా మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ (గతంలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్) ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.