Take a fresh look at your lifestyle.

జోగిపేటలో ఘనంగా జోగినాథ స్వామి జాతర బండ్ల ఊరేగింపు

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.
జోగినాధ స్వామి జాతరలో భాగంగా ఈరోజు రైతులందరూ ఎడ్లబండ్లను సుందరంగా అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ కుటుంబ సమేతంగా జై జోగినాథ స్వామి అంటూ నినాదాలు చేస్తూ ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జోగిపేట ఆందోల్ మరియు పరిసర గ్రామాల నుండి భక్తులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జాతర ఉత్సవాన్ని చూసి పరవశించిపోయారు. మున్సిపల్ రెండవ వార్డు పరిధిలో చండూరు రాములు ఎడ్ల బండిని ముస్తాబు చేసి వారి ఇంటి వద్ద నుండి ఎడ్ల బండికి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి ఎడ్ల బండ్ల శోభయాత్ర ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పెద్దలు చండూరి రాములు వారి కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.

జోగిపేటలో ఘనంగా జోగినాథ రథోత్సవం…

జోగిపేటలో గల చరిత్రాత్మక దేవాలయం జోగినాథస్వామి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం ఎడ్లబండ్లతో ఊరేగింపు నిర్వహించారు. క్లాక్టవర్ నుంచి ప్రారంభమైన ఎడ్లబండ్ల ఊరేగింపు డప్పుచప్పుళ్లతో, నాట్యాలతో జోగినాథస్వామి దేవాలయం చేరుకుంది. శనివారం రథోత్సవ ప్రధాన ఘట్టం. కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాత్రి 10 గంటలకు గౌని చౌరస్తాలో రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు 40 అడుగుల ఎత్తు గల రథాన్ని తాడు పట్టుకొని ముందుకు లాగుతూ ఊరేగింపు ప్రారంభించారు. ఊరేగింపు పోచమ్మ దేవాలయం, హన్మాన్ దేవాలయం మీదుగా అర్థరాత్రి 1 గంటలకు జోగినాథ దేవాలయానికి చేరుకుంది. మధ్యలో భక్తులు విరాళాలు అందజేశారు. ఇంటింటి ముందు మహిళలు నీటితో అభిషేకం చేశారు. రథోత్సవాన్ని తిలకించడానికి జోగిపేట చుట్టుపక్కల సుమారు 40 గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఇందులో మున్సిపల్ చైర్మన్ క్రిష్ణారెడ్డి, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.