Take a fresh look at your lifestyle.

14న అగ్నివీర్ అభ్యర్థులకు మెడికల్ క్యాంపు

  • కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఈ నెల 14న అగ్నివీర్ ఎస్.ఏ.సి.జి.డి అభ్యర్థులకు పెద్దపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ లో ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తునట్లు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అగ్నివీర్ ఎస్.ఎస్.సి. జిడి అభ్యర్థులకు పెద్దపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ లో జూలై 14న 18 రకాల మెడికల్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులకు కళ్ళు, పళ్ళు, చెవి, ముక్కు సంబంధించిన పరీక్షలను ప్రముఖ వైద్య నిపుణులు చేస్తారని, హైట్, వెయిట్ చెస్ట్ లాంటి పరీక్షలను మాజీ సైనికులు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అభ్యర్థులకు ఏమైనా చిన్నచిన్న మెడికల్ సమస్యలు ఉన్నచో వాటిని అధిగమించి వారు మెడికల్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించడానికి పూర్తి అవకాశం ఉంటుందని తద్వారా అధిక సంఖ్యలో యువత సైన్యం , పారా మిలీటరీ బలగాలలోకి వెళ్లవచ్చని అన్నారు. ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని యువత వినియోగించుకొని సైన్యంలో సేవలందించాలని కలెక్టర్ కోరారు. యువత కోసం నిర్వహించే ఈ వైద్య పరీక్షల నిమిత్తము ఏ అభ్యర్థి నుండి ఎలాంటి డబ్బులు తీసుకోవడం జరగదని, ఈ వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా ఉంటాయని, ఈ అవకాశాన్ని వినియోగించదల్చుకున్న యువత తప్పకుండా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ నిమిత్తం ఇతర వివరాలకై 8886304040, 9573688952 నెంబర్లను సంప్రదించగలరని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.