ముద్ర, గండిపేట్ విలేకరి: ఇందిరమ్మ ఇండ్ల జాబితాల వెరిఫికేషన్ లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ శరత్ చంద్ర తెలిపారు.గురువారం ఇందిరమ్మ ఇండ్లు జాబితాల వెరీఫికేషన్ కార్యక్రమంలో కార్పోరేషన్ కమీషనర్ బి.శరత్ చంద్ర పాల్గొన్నారు.అందులో భాగంగా 9 వ డివిజన్ కిస్మత్ పూర్ లో వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ శరత్ చంద్ర మాట్లాడుతూ..కార్పోరేషన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.పూర్తి స్థాయిలో పారదర్శకత కనబరుస్తూ అర్హులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు.ఈ మేరకు ప్రజలు సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ ఎం.యాదయ్య, బిల్ కలెక్టర్ నవీన్ పాల్గొన్నారు.