ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఫిబ్రవరి 2న వరంగల్ జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జరుగబోయే బీ సీ యుద్ధ బేరి సభ ను విజయవంతం చేయాలని భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.హరినాధ్ గౌడ్, ఆలేరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూకంటి రవీందర్ లు శుక్రవారం భువనగిరి బార్ అసోసియేషన్ కార్యాలయంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు .