Take a fresh look at your lifestyle.

కరెంట్ షాక్ తో రైతు మృతి

  • వాడిలో విషాదం

ముద్ర ప్రతినిధి, మెదక్: బోర్ వద్ద విద్యుత్ మరమ్మత్తు చేస్తుండగా రైతు కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా హవెలి ఘనపూర్ మండలం వాడి శివారులో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంజ జగన్నాథం (48) విద్యుత్ వైర్ల సమస్య ఉందని గతంలో కూడా ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.ఈరోజు మరమ్మత్తు చేస్తుండగా షాక్ తగిలి మరణించాడు. మృతునికి బార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు శివ, చరణ్ ఉన్నారు. హవెలి ఘనపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ట్రాన్స్ ఫార్మర్ వద్ద గతంలో కూడా ఓ రైతు మరమ్మత్తు చేస్తుండగా షాక్ కు గుయ్యాడు. అసువత్రి ఖర్చుల కోసం రైతులు 50 వేల రూపాయలు జమ చేసి ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే రైతు ప్రాణం పోయిందని గ్రామస్తులు ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.