ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశము హాలు నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 106 ఫిర్యాదులు వచ్చాయని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు ఇంచార్జి అదనపు కలెక్టర్ రాజేశ్వరి, అదనపు కలెక్టర్ సుదీర్, ఆర్ డి ఓ శ్రీనివాస్ లకు విన్నవిస్తూ అర్జీలు అట్టి ఫిర్యాదులను సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.