ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చీటింగ్ కేసులో ఆయనపై అభియోగాలు రావడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ మేరకు విచారించేందుకు నోటీసులు ఆయనకు అందజేశారు.ఈ క్రమంలో మంగళవారం సీసీఎస్ పోలీసుల ఎదుట శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు.ఈ విచారణ అనంతరం శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.గతంలో అఖండ ఎంటర్ ప్రైజస్ సంస్థను రూ. 6 కోట్ల మేర మోసం చేసినట్లు శ్రవణ్ రావుపై ఆరోపణలున్నాయి.ఈ మేరకు బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.