ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేసే రాబోయే 50 కోట్ల మంది వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన, భారతదేశపు మొట్టమొదటి జెన్-ఏఐ ఆధారిత సంభాషణాత్మక వాయిస్ షాపింగ్ అసిస్టెంట్ “వాణి – యువర్ మీషో దోస్త్”ను ప్రారంభించినట్లు మీషో ప్రకటించింది.

ఆఫ్‌లైన్ వాతావరణంలో, షాపింగ్ ఎల్లప్పుడూ సంభాషణాత్మకంగానే ఉంటుంది. ప్రజలు తమకు ఏమి కావాలో వివరిస్తారు, ప్రశ్నలు అడుగుతారు, ఎంపికలను పోల్చి చూసుకుంటారు మరియు కొనుగోలు చేసే ముందు భరోసా కోరుకుంటారు. అయితే, ఈ ప్రవర్తన డిజిటల్ కామర్స్‌కు అంత సులభంగా అనువదించబడలేదు. చాలా మందికి, ముఖ్యంగా టైర్ 2+ మార్కెట్లలో, టైపింగ్, ఫిల్టర్లు మరియు స్ట్రక్చర్డ్ సెర్చ్ ద్వారా యాప్‌లను నావిగేట్ చేయడం అసహజంగా అనిపించవచ్చు. సంభాషణాత్మక షాపింగ్‌ను డిజిటల్ అనుభవంలోకి తీసుకురావడం ద్వారా ఈ అంతరాన్ని పూడ్చడానికి “వాణి – యువర్ మీషో దోస్త్” రూపొందించారు.వినియోగదారులు తమ సొంత మాటల్లో మాట్లాడవచ్చు, తదుపరి ప్రశ్నలు అడగవచ్చు మరియు సహజమైన, కొనసాగుతున్న సంభాషణ ద్వారా తమ ఎంపికలను మెరుగుపరుచుకోవచ్చు. ఈ ఆవిష్కరణతో, మీషో తన సంభాషణాత్మక వాణిజ్యం (కన్వర్సేషనల్ కామర్స్) అనే విస్తృత దృక్పథం దిశగా అడుగులు వేస్తోంది. మరింత సహజమైన, వాయిస్-ఆధారిత అనుభవాల ద్వారా వినియోగదారులు ఇ-కామర్స్‌తో ఎలా సంకర్షణ చెందుతారో అనే దానిని ఇది పునఃరూపకల్పన చేస్తోంది. ఒక ఉత్పత్తిని కనుగొనడం నుండి కొనుగోలు చేయడం వరకు, మొత్తం షాపింగ్ ప్రయాణంలో వినియోగదారులకు మద్దతు ఇవ్వడానికి రూపొందించబడింది. ఇది సంబంధిత తదుపరి ప్రశ్నలు అడగడం ద్వారా వినియోగదారు ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటుంది, విస్తృతంగా బ్రౌజ్ చేయకుండానే అత్యంత సంబంధిత ఉత్పత్తులను చూపించడంలో సహాయపడుతుంది.
మీషో లిమిటెడ్ సహ-వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, “మీషోలో, మేము విస్తరణ కోసం నిర్మించే విధానంలో ఏఐ ఎల్లప్పుడూ ప్రధాన భాగంగా ఉందన్నారు. ఏటా 25.1 కోట్లకు పైగా లావాదేవీలు జరిపే వినియోగదారులతో, భారతదేశం ఎలా షాపింగ్ చేస్తుందనే దానిపై తమకు పటిష్ట అవగాహన ఉందని, చాలా తక్కువ ప్లాట్‌ఫారమ్‌లు మాత్రమే చేయగలిగే రీతిలో వినియోగదారుల అవసరాలను ముందుగానే ఊహించి, పరిష్కరించడానికి ఇది తమకు వీలు కల్పిస్తుందని వెల్లడించారు.