Take a fresh look at your lifestyle.

డీజీపీకి జాతీయ మావన హక్కుల కమిషన్ నోటీసులు

  • పోలీసుల దెబ్బలతో మృతి చెందిన ఆటో డ్రైవర్ ఇర్ఫాన్.
  • కేసును సుమోటోగా స్వీక‌రించిన జాతీయ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర డీజీపీ జితేందర్‌కు జాతీయ మావనహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. గత నెల 13వ తేదీన రాజేంద్రనగర్ పోలీసుల వేధింపులతో ఆటో డ్రైవర్ చనిపోయాడు. గండిపేటకు చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్ వేధిస్తున్నాడు అంటూ అతడి భార్య రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాత్రి 7:30 గంట‌ల స‌మ‌యంలో పోలీసులు అత‌డిని స్టేష‌న్‌లోని ఓ గదికి తీసుకువెళ్లి రబ్బర్ బెల్డుతో కొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఇర్ఫాన్ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మెట్లపై వాంతులు చేసుకుని కుప్పకూలి పడిపోయాడు. తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. ఇర్ఫాన్ మృతికి రాజేంద్రన‌గ‌ర్ పోలీసులే కార‌ణం అని, వారు తీవ్రంగా కొట్టడంతోనే చ‌నిపోయాడ‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో ఇర్ఫాన్ మృతిని జాతీయ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ సుమోటోగా స్వీక‌రించింది. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి పూర్తి నివేదిక ఇవ్వాల‌ని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.