Take a fresh look at your lifestyle.

నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి

  • ఇకపై ప్రతివారం రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.
  • సమావేశం నిర్ణయాలపై సమీక్ష.
  • నిధుల సమీకరణ పరిశీలన కోసం ప్రత్యేక అధికారి నియామకం.
  • రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు కోసం అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.గురువారం రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాఖల వారీగా అంశాలను సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఇకపై రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రతివారం జరుగుతుందని చెప్పారు.ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఆ నిర్ణయాల అమలు ప్రగతిపై వచ్చేవారం సమావేశంలో అంశాల వారీగా సమీక్షిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు   చెప్పిన అంశాలు, వాటి పురోగతిని నిరంతరం పరిశీలించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక అధికారిని నిర్మించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజు, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ,సి సి ఎల్ ఏ సెక్రటరీ నవీన్ మిట్టల్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, కమిషనర్లు హరిత, హరికిరణ్, విష్ణువర్ధన్, సురేంద్రమోహన్, బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఇలంబర్తి , ఆర్ వి కర్ణ న్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.