Take a fresh look at your lifestyle.

 జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి

  • దేశవ్యాప్త కుల గణనకు అంత టైం ఎందుకు? 
  • 2026 లోనే కుల గణన పూర్తి చేయాలి.
  • కేంద్ర ప్రభుత్వం వెంటనే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాలి.
  • ఈనెల రెండో వారంలో హైదరాబాదులో మేధావుల సమావేశం నిర్వహిస్తాం. 
  • జూలై మొదటి వారంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 
  • బీసీ సంక్షేమ సంఘం నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, చిరంజీవులు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : దశాబ్దాలుగా బీసీలు చేస్తున్న పోరాటానికి తలొగ్గి కేంద్రం దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణణ చేస్తామని ప్రకటించిందని కానీ దానిని వెంటనే మొదలుపెట్టి 2026లోగా కుల గణన పూర్తి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టి చిరంజీవులు డిమాండ్ చేశారు.గురువారం హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్ అధ్యక్షతన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్, చిరంజీవిలు  మాట్లాడుతూ, 2027 లోగా  కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించడం పట్ల తీవ్రంగా ఆక్షేపించారు. ఇంకా రెండు సంవత్సరాలు కులగణన చేస్తామని ఇప్పుడు కేంద్రం ఎందుకు చెబుతోందని ప్రశ్నించారు.కుల గణను చేసి బీసీ రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం పెంచాలని తాము దశాబ్దాలుగా పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం స్పందించి కులదరణ చేస్తామని చెప్పినందుకు దేశవ్యాప్తంగా బీసీలు ఎంతో సంతోషపడ్డారన్నారు.కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర సెక్రటేరియట్ లో ఉన్న అగ్రకుల అధికారుల తప్పుడు సలహలతో రెండు సంవత్సరాల గడువుతో షెడ్యూలు విడుదల చేసిందని విమర్శించారు.

అత్యంత కమ్యూనికేషన్, టెక్నాలజీ కలిగి ఉన్న భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఆరు నెలల్లోనే దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు సమగ్ర కులగలను పూర్తిచేసే అవకాశం ఉందన్నారు.కానీ 2027 లో ప్రారంభిస్తాం అని చెప్పడంలో దేశంలోని బీసీలు కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. త్వరగా కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంపు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా దామాషా ప్రకారం కేంద్ర బడ్జెట్ లో నిధులు పెంచితేనే  బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.

ప్రధాని ఒక బీసీ బిడ్డగా తాము అమితంగా గౌరవిస్తామన్నారు. అదే సమయంలో గతంలో బిజెపిలో ఉన్న కొద్ది మంది పెద్దలు రిజర్వేషన్లను కులగ ణకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు.ఇప్పుడు కూడా  బీహార్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కులగణన అంశాన్ని ఆటకిక్కిస్తారేమోనని సందేహం కలుగుతుందన్నారు. ఎలాంటి సందేహాలకు అనుమానాలకు తావు ఇవ్వకుండా ఉండాలంటే ఈ సంవత్సరంలోనే  విధివిధానాలను రూపొందించి కులగణన ప్రక్రియను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.కులగణన పై కేంద్రం అనుసరించాల్సిన విధివిధానాలు, ప్రశ్నావళి, కులాల సామాజిక స్థితిగతులపై పూర్తిగా అధ్యయనం చేసి  బీసీ సమాజం తరఫున ఒక నివేదిక ఇవ్వడానికి ఈనెల రెండో వారంలో హైదరాబాదులో బీసీ మేధావులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే నెలమొదటి వారంలో ఢిల్లీలో కులగణన పై అఖిలపక్ష రాజకీయ పార్టీల ఓబీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.   దేశంలో కులగణన ప్రారంభమై ముగిసే వరకు, ఆ వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించి బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం పెంచే వరకు బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు

Leave A Reply

Your email address will not be published.