ముద్ర,ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………
సోషల్ మీడియా లో కాంగ్రెస్ నేతలపై పెట్టిన పోస్టుల ఆధారంగా జర్నలిస్ట్ లపై పెట్టిన కేసు లను వెంటనే ఎత్తివేయాలని tuwj రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ పాలమూరు పోలీసులను డిమాండ్ చేశారు. గురువారం మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేంద్ర చారీ,
కార్యదర్శి నరేందర్ గౌడ్ ,మరో జర్నలిస్ట్ శ్యామిల్ సుందరచారీలపై పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించు కోవాలన్నారు.ప్రెస్ క్లబ్ ప్రతినిధులపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు అక్రమంగా నమోదు చేశారని,కేవలం సోషల్ మీడియా పోస్టులను సాకుగా చూపి జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
రాజకీయ నాయకులు, జర్నలిస్టుల మధ్య ఉండాల్సిన ఆరోగ్యకరమైన సంబంధాలను ఇలాంటి కేసులు దెబ్బతీస్తాయని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు.ఈ కేసులను నాలుగు రోజుల్లోగా తొలగించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని విరాహత్ అలీ హెచ్చరించారు.
ఈ అంశాన్ని రాష్ట్ర డీజీపీ, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు.
జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి అక్రమ కేసులను రద్దు చేయాలని, లేకుంటే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు.
…………………………………
అర్హులందరికీ అక్రిడేషన్లు దేశాన్లు
………………………………….
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించే ప్రక్రియ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోందని విరహత్ అలీ పేర్కొన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందించామని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగితే యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జర్నలిస్ట్ ల సమస్య ల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు.
ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి,కల్కూరి రాములు,హైమద్ పాష జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు కాటం నాగరాజు గౌడ్,సతీష్ రేడ్డి, తదితరులు పాల్గొన్నారు.