- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
ముద్ర, జగిత్యాల టౌన్: వచ్చే భవిష్యత్తు తరాల కోసం రాజకీయం చేయాలి, కానీ వచ్చే ఎన్నికల కోసం కాదని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.40 లక్షలతో డబల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన చేసి, రూ.20 లక్షలతో నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మాణ పనులు పరిశీలన చేశారు. అలాగే రూ.25 లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో పలు కాలనీల్లో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, ఎమ్మర్వో శ్రీనివాస్, డిఈ మిలింద్, ఎంపీఓ రవి బాబు, మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ లు చెరుకు జాన్, గర్వంధుల గంగన్న, నక్కల రవీందర్ రెడ్డి, బాల ముకుందం, గిద్ద శంకర్, మల్లారెడ్డి, నరేష్, బోనగిరి నారాయణ, నాయకులు గడ్డం నారాయణ రెడ్డి, సత్తి రెడ్డి, పురిపాటి రాజిరెడ్డి, మాజీ ఆత్మ ఛైర్మెన్ ఏలేటి రాజిరెడ్డి, చంద్రా రెడ్డి, ములాసపు మహేష్, రంగు మహేష్, నరేష్, రాజేష్, సూర్య ప్రకాష్, సత్తెమ్మ, మహిళలు, యువకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
