ముద్ర, జగిత్యాల టౌన్: పట్టణంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్ మరమ్మత్తులు చేపించాలని కోరుతు జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన ను వాకర్స్ అసోసియేషన్ సభ్యులు గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెన్ జిమ్స్ మెయింటెనెన్స్ రిపేరు, గ్రౌండ్ ఫ్లోర్ చెడిపోయి ఇబ్బందికరంగా మారిందని, వాటిని వెంటనే మరమ్మత్తులు చేయించాలని కోరారు. స్పందించిన కమిషనర్ వెంటనే ఏఈని పిలిచి టెండర్ ప్రక్రియ చేయవలసిందిగా సూచించారు. వీలైనంత తొందరలోనే అన్ని జిమ్ములు మెయింటెనెన్స్, రిపేర్ చేయడం, గ్రౌండ్స్ పది రోజులకు ఒకసారి క్లీన్ చేయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధరూర్ క్యాంపు వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు ఐల్నేనేని వెంకటేశ్వర్ రావు, రైల్వే ట్రాక్ అధ్యక్షుడు బొల్లారం రాజయ్య, వివేకానంద మినీ స్టేడియం అధ్యక్షులు నేరెళ్ల వెంకన్న, మున్సిపల్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు పాత సుధాకర్, ఎస్ కె ఎన్ ఆర్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా సురేష్ తదితరులు పాల్గొన్నారు.
