Take a fresh look at your lifestyle.

అవినీతిలేని సుపరిపాలన కోసం పని చేయాలి ట్రైనీలకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన

 
ముద్ర ప్రతినిధి, మెదక్:*

అవినీతికి తావు లేకుండా సుపరిపాలన కోసం పనిచేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన ట్రైనీ గ్రూప్6-1 అధికారులకు సూచించారు.
మంగళవారం కలెక్టరేట్ లో నూతన ట్రైనీ గ్రూప్-1 అధికారులలో ఇంటరాక్ట్ అయ్యారు. ట్రైనీ అధికారులు శిక్షణ అనంతరం ఉద్యోగ బాధ్యతలలో పారదర్శకంగా, జవాబుదారిగా ఉద్యోగం చేసినపుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు.దేశంలో గ్రామీణ వ్యవస్త చాలా పెద్దదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల అభివృద్దే దేశ అభివృద్ధి అన్నారు.సేవల్లో తమ చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకోవాలన్నారు.ఉద్యోగ సేవల్లో టెక్నాలజీని కూడా ఉపయోగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి
ఈనెల 19న మెదక్, 20న నర్సాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు.
మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ ఆధ్వర్యంలో
బంజారా సంఘం నాయకులతో ఏర్పాటుచేసిన సమీక్షలో అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.