మంథని, ముద్ర: ఘనంగా శ్రీపాదరావు జయంతి మంథని నియోజకవర్గంలో మాజీ స్పీకర్,దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు 88వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు.మంథని పట్టణంలో శ్రీపాద చౌక్,రావులచెరువు కట్ట వీధి, ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీపాద రావు విగ్రహాలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.