రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి: ఈదురు గాలులు,వర్షాల కారణంగా సింగరేణి కరెంట్ (పవర్) సంబంధించిన ఎమర్జెన్సీ సమస్యలకై 8332974670 నెంబర్ కు సమాచారం అందించాలని ఎలక్ట్రికల్ సిబ్బంది సూచించారు.కరెంట్ పోల్ విరిగిన,చెట్ల కొమ్మలు లైన్ పై పడిన,కండక్టర్లు తెగిపడ్డ,ఇతర ప్రమాదకర సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరిస్తామని చెప్పారు.