కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి: ముందస్తు బడిబాటలో భాగంగా కథలాపూర్ మండలంలోని తక్కలపల్లి, సిరికొండ గ్రామంలో మండల విద్యాధికారి లోకిని శ్రీనివాస్, జడ్పిహెచ్ఎస్ తక్కలపల్లి ప్రధానోపాధ్యాయులు మోటూరి రవీందర్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రతి ఇంటికి తిరిగి తల్లిదండ్రులను కలిసి విద్యార్థుల వివరాలను నమోదు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయ బృందాలు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు, పాల్గొన్నారు.