Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెల్పించాలి : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పలు వార్డులలో ప్రచారం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని భవనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఓటర్లను కోరారు. బుధవారం పట్టణంలోని 12వ వార్డు పగిడిపల్లిలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో కొబ్బరికాయ కొట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పగిడిపల్లి లోని ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూరి విజయలక్ష్మి వెంకటేష్ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించారు. అనంతరం 10వ వార్డు హౌసింగ్ బోర్డ్ లో అభ్యర్థి బింగి నరేష్ గెలుపుకై ప్రచారం చేశారు. 13వ వార్డు ప్రగతి నగర్ లో ఇంటింటి ప్రచారంలో అభ్యర్థి గుర్రాల సంతోషా శ్రీనివాస్ చేతి గుర్తుపై ఓటు వేయాలని కోరారు. 29 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోతంశెట్టి మంజూల వెంకటేశ్వర్లు, 19 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాకూరి ప్రకాష్ లను గెలుపుకై ప్రచారం చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలు పార్టీ అని చేస్తున్న సంక్షేమ కార్యక్రమంలో అభివృద్ధి చేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ అవైస్ చిస్తీ, పార్టీ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్, నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్, తాంగేళ్లపల్లి రవి కుమార్, ఈరాపాక నర్సింహా, పడిగేల ప్రదీప్, బింగి బిక్షపతి, అమనాథ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.