Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచండి జిల్లా కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర:

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదిశగా విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక విద్యావారోత్సవాల్లో బుధవారం స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లకు విద్యా సంబంధిత అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, పాఠశాలల అభివృద్ధిలో స్థానిక నాయకత్వం వహించినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని వివరించారు. గత రెండేళ్ల కాలంలో సుమారు 40 కోట్ల రూపాయల నిధులతో జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల ద్వారా తల్లిదండ్రులను విద్యా వ్యవస్థలో భాగస్వామ్యం చేశామని, వీటి పర్యవేక్షణలోనే యూనిఫాంల పంపిణీ, పాఠశాలల ఆధునీకరణ పనులు పారదర్శకంగా సాగుతున్నాయని వెల్లడించారు. ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని అంగన్‌వాడీ పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు ఎక్కడా విద్యార్థులు మధ్యలో చదువు ఆపకుండా (డ్రాపౌట్స్) పర్యవేక్షించాలని సూచించారు. దివ్యాంగ పిల్లల కోసం భవిత కేంద్రాలను బలోపేతం చేశామని, వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆధునిక బోధనను అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన, మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయని బడిబాట ద్వారా ప్రతి పాఠశాలకు నిర్దేశించిన ఎన్‌రోల్‌మెంట్ లక్ష్యాన్ని చేరుకోవాలని, ఇందుకోసం గ్రామాల్లో, వార్డుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఈ సందర్బంగా కలెక్టర్ ప్రజాప్రతినిధులను కోరారు.

Leave A Reply

Your email address will not be published.