సిద్ధిపేట, ముద్ర ప్రతినిధి :
10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే హరీష్ రావు కు రెవెన్యూ వ్యవస్థ గుర్తు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెవెన్యూ వ్యవస్థ ఉన్నట్లు గుర్తించారా అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఏద్దేవా చేశారు.శుక్రవారం సిద్ధిపేటలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో రెవెన్యూ ఆఫీసులలో తనిఖీలు ఆకస్మికంగా ఎందుకు చేపట్టలేదు అని ప్రశ్నించారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడితేనే ధరణి అక్రమం బయటపడింది అని ధరణి పేరుతో 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం లో చెప్పలేనన్ని అక్రమాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి అక్రమాలను సరిచేసి భూభారతిగా అమలు చేస్తున్నాం అని అన్నారు. భూ భారతి పథకం అమలు కావడంతో రైతులు ప్రజలు తమ భూములకు రక్షణ దొరికింది అని సంతోషం ఆనందం లో ఉన్నారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదు అని అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందడానికి బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకునేందుకు ప్రతిరోజు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. సాదా బైనామా దరఖాస్తులు మీ ప్రభుత్వ హయాంలోనే పెండింగ్లో ఉన్నాయని పైగా తమ ప్రభుత్వం లోనే పెండింగ్లో పెట్టినట్టు అబద్ధాలు మాట్లాడటం బీఆర్ఎస్ నాయకులకే చెల్లుతుందన్నారు.భూముల కబ్జాపై మాట్లాడుతున్న హరీష్ రావు గ సిద్ధిపేటలో 1340,1668 సర్వే నంబర్లలో బీఆర్ఎస్ నాయకులు కొండం సంపత్ రెడ్డి రాజనర్సులు కబ్జా చేయాలేదా అని ప్రశ్నించారు. సిద్ధిపేటలో కబ్జా అయిన భూములపై దమ్ముంటే విచారణకు ఆదేశించి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో త్వరలోనే ఏర్పాటు చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాదారి మధు
గయాజుద్దీన్ హర్ష హుస్సేన్ విజయ డానియల్ నజ్జు బాబా రాజు రెడ్డి సంతోష్ గౌడ్ ఇంద్ర తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు