Take a fresh look at your lifestyle.

మార్క్సిజమే మానవాళికి సరైన మార్గం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

మార్క్సిజమే మానవాళికి సరైన మార్గం చూపిస్తుందని దోపిడీ అసమానతలను ప్రారదోలేది ఒకే ఒక ఆయుధం మార్క్సిజం మాత్రమేనని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్ అన్నారు. కారల్ మార్క్స్ 143 వ వర్ధంతి కార్యక్రమం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాళ్ల బండి శశిధర్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి దోపిడి నుండి విముక్తి చెందాలంటే అందుకు సరైన మార్గం చూపిన వ్యక్తి కార్లు మార్క్స్ అని ఆయన సిద్ధాంతం ప్రకారం అసమానతలు లేని, దోపిడీ లేని సమాజం నిర్మించడమే మార్క్సిజం యొక్క అంతిమ లక్ష్యమని వారన్నారు.1848లోనే కమ్యూనిస్టు ప్రణాళికలు రూపొందించి దోపిడికి పీడనకు గురి అవుతున్న కార్మిక వర్గానికి మొట్టమొదటిసారిగా దిక్సూచిని అందించినటువంటి మహోన్నత వ్యక్తి కారల్ మార్క్స్ అన్నారు. అలాంటి మహనీయుడు కి మనం నిజమైన నివాళులు అందించడం అంటే దోపిడి రహిత సమాజాన్ని నిర్మించడమే అసలైన లక్ష్యమని అందుకు సిపిఎం పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు చొప్పరి రవికుమార్, అమ్ముల బాల నర్సయ్య, జాలిగాపు శిరీష నాయకులు మామిడాల కనకయ్య, తునికి మహేష్, వంగ రవీందర్ రెడ్డి, కొండం సంజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.