Take a fresh look at your lifestyle.

అసంపూర్తి భవనాలతో ర్యాంకులు ఎలా కొడుతారు…?

 

– రెండు ఏళ్ల నుండి సిద్దిపేట లో అర్దాంతరాంగ ఆగిపోయిన అభివృద్ధి పనులు..

– గత ప్రభుత్వం లో మంజూరు అయిన బిసి స్టడీ సర్కిల్ పనులు చివరి దశలో ఉన్న రెండేళ్లల్లో తట్టేడు మట్టి ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వం..

– బిసి స్టడీ సర్కిల్ భవన నిర్మాణ పనులను సందర్శించిన బి ఆర్ ఎస్ నేతలు…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు స్థలం, నిధులు కేటాయిస్తే ఒకటి వరకు 75% పనులు మాత్రమే పూర్తయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం విమర్శించారు. అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి వెంటనే స్టడీ సర్కిల్ నిరుద్యోగులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన భవనాలకు ప్రభుత్వ నిధులతో గాని, సొంత నిధులతో గాని కనీసం సున్నాలు కూడా వేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఆరోపించారు. ఇలాగైతే అభ్యర్థులు ర్యాంకులు ఎలా సాధిస్తారని అన్నారు.
సిద్దిపేట పౌరునిగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రతినిధిగా నేను కాంగ్రెస్ నాయకులకు సవాల్ బిసి స్టడీ సర్కిల్ దగ్గర ఉండి సవాల్ విసురుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిధులతోనైనా మీ స్వంత నిధులతో అయిన సరే హరీష్ రావు నిర్మించిన భవనాలకు సున్నాలు వేస్తే మీరు గొప్పవాళ్ళ మొగోల్ల అని పాల సాయిరాం సిద్దిపేట లోని ప్రత్యర్థి పార్టీ నాయకులకు సవాల్ విసిరారు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ ను సీనియర్ నాయకులు ప్రభాకర్ వర్మ, శ్రీహరి యాదవ్ ఇతర సీనియర్ నాయకులు,బిఆర్ఎస్వి, బిఆర్ఎస్ యువజన విభాగం, నిరుద్యోగ యువతతో కలిసి బిఆర్ఎస్ నాయకులు సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని బీసీ స్టడీ సర్కిల్ కు నూతన భవనం మంజూరు చేయించి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అయితే ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పట్టించుకోకపోవడం ద్వారా స్టడీ సర్కిల్ లో చదువుకునే విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న స్టడీ సర్కిల్ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.