అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం..
జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో శ్రీ స్వామి వారికి పంచామృతములు, పసుపు, సుగంధ ద్రవ్యాలతో వసంతోత్సవ సేవను శోభాయ మానంగా అర్చక స్వాములు గావించారు.

శనివారం ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవ
శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు. సుగంధ భరితమైన పుష్పమాలలతో తోమాల సేవ లోక కళ్యాణం కోసం శ్రీ సుదర్శన నారసింహ హవనంను చేశారు. అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 5000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, శనివారం సందర్భంగా జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు.