Take a fresh look at your lifestyle.

భవిష్యత్ ఆశాకిరణం కవితక్క- జాగృతి స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్

 

ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం

 

ముద్ర, తుంగతుర్తి…

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే ఆశాకిరణం కవితక్క మాత్రమేనని, బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వాల నిర్లక్షవైఖరిపై పోరాటాలు జరుపుతామని తెలంగాణ జాగృతి స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు శనివారం తుంగతుర్తి నియోజకవర్గ తిరుమలగిరి మండల కేంద్రంలో కవిత పెట్టబోయే కొత్త పార్టీ ఆవిర్భావ సభ ప్రచారం లో భాగంగ వివిధ మండలాల్లో పోస్టర్ ఆవిష్కరణలు చేశారు, ఈ సందర్భంగా సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఆవిర్భావ సభ కు పెద్దసంఖ్యలో ప్రజలను తరలించాలని సూచించారు, రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులపై ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది అన్నారు, పుష్కర కాలం గా జరిగిన పాలన ప్రజలకు ఫలాలు అందించలేదని ,సంపూర్ణ తెలంగాణ కోసం ఉద్యమించి సామాజిక తెలంగాణ సాధించుకునే వరకు పోరాడుతామని కవితక్క నేతృత్వం లో ప్రభుత్వ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా జాగృతి శ్రేణులు పనిచేయాలని కోరారు , ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షురాలు ఎస్ కృష్ణవేణి , రాష్ట్ర నాయకులు మందడి సోమిరెడ్డి తో పాటు ఆయా మండలాల మండల, జిల్లా నాయకులు జి శ్యామ్ నాయక్, ఎన్ చిరంజీవి, పి మహేష్, విప్లవ కుమార్,మహేశ్వరి , సై దమ్మ , జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.