సృజనాత్మకత, దేశభక్తితో కలిసిన చోటే భవిష్యత్తు ఆవిర్భవిస్తుంది.”** “విద్యకు వేదికగా, ప్రతిభకు ప్రతీకగా నిలిచిన పాఠశాల”.**
కరీంనగర్ :స్థానిక జగిత్యాల రోడ్ లో గల వివేకానంద (రెసిడెన్షియల్ (సి.బీ.ఎస్.ఈ) పాఠశాల 43వ వార్షికోత్సవ వేడుకలు “అవిష్కర్” పేరిట పాఠశాల వార్షికోత్సవం అపూర్వ వైభవంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. రఘు రామన్. అతిథులను వేదికపైకి ఆహ్వానించి మొక్కలు అందజేయడం, దీపప్రజ్వలన, ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ వేడుకలకు ఛైర్మన్ డా. సుధాకర్ రావు పోల్సాని, సెక్రటరీ శ్రీమతి. రమాదేవి పోల్సాని, అకడమిక్ డైరెక్టర్ డా. టి. లలితా కుమారి, హానర్ డా. రఘు రామన్, సాయంత్రం జరిగిన సభలో ఛైర్మన్, అకడమిక్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ ప్రసంగాలు ప్రేరణాత్మకంగా నిలిచాయి.
పుస్తకాలకే పరిమితం కాని విద్యే నిజమైన విద్య. ఇలాంటి వేడుకలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి” అంటూ పాఠశాల కృషిని హృదయపూర్వకంగా ప్రశంసించారు.
విద్యార్థులు ప్రదర్శించిన నాటకాలు సమాజానికి చైతన్యాన్ని నూరిపోసేలా, నృత్యాలు సంస్కృతికి ప్రతిరూపాలుగా, గేయాలు సందేశాత్మకంగా నిలిచాయి. ప్రతి ప్రదర్శన ప్రేక్షకుల హృదయాలను తాకి, చప్పట్ల మోత మోగించింది. సాంస్కృతిక ప్రదర్శనలలో తెనాలి రామకృష్ణ భక్త ప్రహ్లాద నాటకం, దేశభక్తి, పండుగలు, భారతదేశం సాధించిన విజయాలు, జాతీయ చిహ్నాలు అంశాలకు సంబంధించిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల సృజనాత్మకతకు ఇది అద్దం పట్టిన వేడుకగా నిలిచింది.
చిన్నారులు ప్రతి ఒక్కరూ తమ అంతర్లీన ప్రతిభను నిర్భయంగా, నిస్సంకోచంగా ప్రదర్శించారు. ఈ వార్షికోత్సవం పాఠశాల ప్రతిష్ఠను మరో మెట్టు పైకి చేర్చింది.ఈ వార్షికోత్సవం విద్యార్థుల ప్రతిభకు వేదిక మాత్రమే కాదు, మా ఉపాధ్యాయుల అంకితభావన, కృషి ఫలితం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులు విద్యార్థినీ, విద్యార్థులకు అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ శ్రీమతి.టి . లలితా కుమారి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు. పాఠశాల సలహాదారులు డాక్టర్ శ్రీ. గండ్ర లక్ష్మణరావు గారు, మరియు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రేణుక బలివాడ పాల్గొన్నారు. ” సృజనాత్మకత, ఆవిష్కరణ, అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న భారతదేశ ఆత్మను ప్రతిబింబించేలా కార్యక్రమాలు సాగాయి. ప్రసంగాలు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచాయి.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శక్తివంతమైన నృత్యాలు ఆవిష్కార్ స్ఫూర్తిని, “నయా భారత్” స్వప్నాన్ని ప్రతిబింబించాయి. ఉత్సాహభరితమైన డాండియా నృత్యాలు, జానపద గీతాలు, విద్యాదేవి సరస్వతీ దేవికి అంకితమైన నృత్య ప్రదర్శన భారతీయ సంప్రదాయాన్ని ఆధునిక భావాలతో కలిపి చూపించాయి.
ప్రతి ప్రదర్శన విద్య, సాంకేతికత, సంస్కృతి రంగాల్లో ఎదుగుతున్న భారతదేశ విజయాలను ప్రతిబింబించింది. విద్యార్థుల ఆత్మవిశ్వాసం, ప్రతిభ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఛైర్మన్ మరియు డైరెక్టర్ మేడమ్ విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించగా, తల్లిదండ్రులు పిల్లల ప్రతిభపై గర్వం వ్యక్తం చేశారు. విద్యార్థుల సృజనాత్మకతను, వేదికపై చూపిన ధైర్యాన్ని ప్రశంసించి, పాఠశాల నిర్వహణను అభినందించారు. ఈ వార్షికోత్సవం విలువలు,j సృజనాత్మకత, దేశభక్తి సమన్వయంగా నిలిచి, భవిష్యత్తు భారతాన్ని నిర్మించే చిన్నారుల ప్రతిభకు అద్భుత వేదికగా నిలిచింది.