Take a fresh look at your lifestyle.

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

ముద్ర, మోత్కూర్:

ప్రజా పాలన–ప్రగతి పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ వారం నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు డ్రాయింగ్, క్విజ్, ఎస్సే రైటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, నాణ్యమైన భోజనం, వసతి వంటి సదుపాయాలను కల్పిస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోనీ ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు.
మండల ప్రత్యేక అధికారి హాస్టల్ స్పెషల్ ఆఫీసర్ జి సురేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి, ఫిజికల్ గేమ్స్ ఆడడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న మాట్లాడుతూ హాస్టల్ అభివృద్ధికి మున్సిపాలిటీ నుండి పూర్తి సహకారం ఇస్తామని విద్యార్థులను అభినందించారు. ఈ పోటీలలో గెలుపొందిన కే బన్నీ, ఎం అవిలాష్, జి ఆదిత్య లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్, హాస్టల్ వార్డెన్ అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు క్విజ్ పోటీలు.-తహశీల్దార్ జ్యోతి.


విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు క్విజ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని తహసిల్దార్ జ్యోతి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి అని ఆన్నారు.సమాజం లోని అన్ని అంశాలపై విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.అనంతరం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఎస్ ఓ యాదమ్మ, ఉపాధ్యాయురాలు సి హెచ్ రేఖ, మహేశ్వరి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.