ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని రవీంద్ర ప్లే స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా యూకేజీ పూర్తిచేసుకుని ఫస్ట్ క్లాస్ లోకి అడుగుడుతున్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ భీమయ్య మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డే అన్నది డిగ్రీ పూర్తి అయిన వారికి మాత్రమే జరిగేది కానీ ప్రీ ప్రైమరీ లెవెల్ లో జరుపుకోవడం చాలా ఆనందదాయకమని, మా పిల్లల కోసం గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా అమెరికా లో ప్రోగ్రాంలో పాల్గొన్నానని ఆయన స్వీయ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఇంత చక్కగా చిన్న పిల్లలకు గ్రాడ్యుయేషన్ చేయడం మర్చిపోలేని అనుభవమని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు పాఠశాల డైరెక్టర్ బి శ్రీధర్ రావు,పాఠశాల డైరెక్టర్లు కే . సుమన్ రావు, బి హరిచరణ్ రావు, కే . కిషన్, జె. రాజు, జె మౌనిక తదితరులు పాల్గొన్నారు.
