Take a fresh look at your lifestyle.

కొండగట్టులో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

ముద్ర, మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ఈనెల 10 నుండి ప్రారంభం అయిన పవిత్రోత్సవాలు బుధవారంతో ముగిసాయి.ఈ సందర్బంగా శ్రీ స్వామివారికి క్షీరాభిషేకం సహస్ర నాగవళ్లి దళ అర్చన, పట్టు వస్త్రాలంకరణ, దివ్యప్రబంధ పారాయణము, హవనము, పూర్ణాహుతి, దేవతా ఉద్వాసనం, శ్రీ స్వామివారికి పవిత్రధారన తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.సాయంత్రం సామూహిక భజన, రామనామ సంకీర్తనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ టి.శ్రీకాంత్, డిప్యూటీ కమిషనర్, స్దాన చారి కపిందర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, జితేందర్ స్వామి, రఘు లతో పాటుగా అర్చక స్వాములు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.