మహాదేవపూర్, ముద్ర:
2026-27 సంవత్సరానికి గాను నాలుగవ తరగతి బాల బాలికలకు స్పోర్ట్స్ స్కూల్ నందు ప్రవేశం కొరకు జిల్లా స్థాయి ఎంపికలను స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఉత్సాహంగా నిర్వహించడం జరిగినది.
అన్ని మండలాల కి చెందిన బాల బాలికలకు ఎత్తు, బరువు, 800 మీటర్ల పరుగు, 6 x 10 మీటర్ల షటిల్ రన్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, మెడిసిన్ బాల్ పుట్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ అను తొమ్మిది రకముల పోటీలు నిర్వహించీ ఉత్తమ ప్రతిబ కనబర్చిన 10 మంది బాలురను, 10 బాలికలను రాష్ట్ర స్థాయిలో జరిగే ఎంపికలకు పంపబడతారని భూపాలపల్లి జిల్లా యువజన మరియు క్రీడల అధికార చిర్ర రఘు తెలిపారు.