Take a fresh look at your lifestyle.

ఆదాయాన్ని పెంచుతాం, పేదలకు పంచుతాం

  • ఆ మూడు వర్గాలే కాంగ్రెస్​ ప్రాణం.
  • మహిళలు, రైతులు, యువత ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములు.
  • హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకే ఇన్ ఫ్రా ప్రాజెక్టులు.
  • భారత్​ సమ్మిట్​ లో సీఎం రేవంత్​ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి.. వాటిని పేదలకు పంచడమే తమ విధానమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ సర్కార్​ సంస్కరణల విషయంలో పారదర్శకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తోందన్నారు.ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు, కార్యక్రమాలు, పథకాలకు రూపకల్పన చేస్తున్నట్లు సీఎం చెప్పారు.గత రెండు రోజులుగా హైదరాబాద్​ కేంద్రంగా జరిగిన భారత్​ సమ్మిట్​ సదస్సు శనివారం ముగిసింది.ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గోన్న సీఎం కీలక వ్యాఖ్​యలు చేశారు.రాష్ట్రంలో గిగ్, యాప్ వర్కర్ల కోసం త్వరలోనే వెల్ఫేర్ పాలసీని రూపొందించబోతున్నట్లు చెప్పారు.ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చిత్తశుద్దితో పని చేస్తున్నామన్నారు.దేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్న సీఎం..కుల సర్వే నిర్వహించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వంగా ఉందని చెప్పారు.ట్రాఫిక్ పోలీస్ విభాగంలో థర్డ్ జెండర్ ను రిక్రూట్ చేసుకున్న తొలి ప్రభుత్వంగా తెలంగాణ రికార్డుకెక్కిందన్నారు.విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు ఉద్యమ పోరాటంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు.ఆ తర్వాత అధికారం చేజిక్కించుకున్న బీఆర్​ఎస్​ పాలనలో గడిచిన పదేండ్ల వరకు ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు.తమ ఆకాంక్షల సాధన కోసం ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని చెప్పారు.సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.ముఖ్యంగా విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు, అణగారిన కులాల ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు.భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తాము ప్రారంభించామని సీఎం వివరించారు.గతేడాది ఆగస్టు 15న రూ.20,617 కోట్లు చెల్లించి 25.50లక్షల మంది రైతులను పూర్తిగా రుణ విముక్తులను చేశామని చెప్పారు.రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతుభరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇన్ పుట్ సబ్సిడీ. భూమిలేని రైతుకూలీలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.12,000 సాయం, వ్యవసాయ భూమిలేని, భూమి కలిగిన రైతులకు కలిపి ఏటా రూ.20,000 కోట్లకు పైగా నిధులు, రైతుల పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు సీఎం వివరించారు.రైతుబీమా, పంటల బీమాలతో రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు.యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ప్రారంభించామన్న రేవంత్​ రెడ్డి..తాము అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఐదు లక్షల మంది యువతకు ప్రయోజనం కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించుకున్నట్లు చెప్పారు. మూసీ పునరుజ్జీవనంతో హైదరాబాద్ ను కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా న్యూయార్క్ లోని హడ్సన్ నది, లండన్ లోని థేమ్స్ నది, టోక్యోలోని సుమిదాతో సహా అనేక నగరాల్లో నదీ, నదీతీర అభివృద్ధిని అధ్యయనం చేసినట్లు వెల్లడించారు.భవిష్యత్తులో మూసీ హైదరాబాద్​ కు అతిపెద్ద ఆకర్షణగా మారి వేలాది మందికి ఉపాధిని కల్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అనేక ఇన్ ఫ్రా ప్రాజెక్టులు చేపడుతున్నట్లు చెప్పారు.30 వేల ఎకరాల్లో ప్రపంచస్థాయి నగరం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామన్న సీఎం, 370 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో రైలు విస్తరణ చేపడుతున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.