Take a fresh look at your lifestyle.

మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట ఇన్చార్జ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, అడ్లురి లక్ష్మణ్

తుంగతుర్తి, ముద్ర: మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గత కొంతకాలంగా అస్వస్థతగా ఉండడంతో తుంగతుర్తి లోని ఆయన నివాసంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తం కుమార్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ శుక్రవారం పరామర్శించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆరోగ్య గురించి ఆయన కుమారుడు ఎఐసిసి మెంబర్ రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. సుమారు ఐదు దశాబ్దాల కు పైగా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అప్రతిహతంగా నడిపించి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా, రాష్ట్రంలో దామోదర్ రెడ్డి పేరే బ్రాండ్ గా కొనసాగడం గమనార్హం. అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డిని ఇప్పటికే రాష్ట్ర మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు అనునిత్యం పరామర్శిస్తూ తుంగతుర్తి రావడం జరుగుతుంది. త్వరలోనే మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కొడుకుని మళ్లీ ప్రజాసేవకు వస్తారని ఆశాభావం రాష్ట్ర మంత్రులు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ గుడిపాటి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.