Take a fresh look at your lifestyle.

ప్రజావాణి సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య .

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు , నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ల ఉమహారతి తో కలిసి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులు భూ సమస్యలు, తదితర అంశాలతో పాటు పంచాయతీరాజ్ ఇంజనిరింగ్, వ్యవసాయ, విద్య, వైద్య ఆరోగ్య, డి డబ్ల్యు ఓ, డి సి ఎస్ ఓ, పశుసంవర్ధక, శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను కలెక్టర్ కు అందజేశారు. ఆయా వినతులను పరిశీలించి త్వరిత గతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి లో 56 అర్జీలు అందాయని తెలిపారు.ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఆర్జి దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు,వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ ఓ, ప్రజలు, పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.