ముద్ర, యాదగిరిగుట్ట :
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని శుక్రవారం తెలంగాణ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు.

అనంతరం గర్భగుడిలో స్వయంభు నారసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మంటపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు సురేంద్ర చార్యులు ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం చేయగా సూపర్డెంట్ రాజన్ బాబు స్వామివారి లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. వీరి వెంట ఎస్పీఎఫ్ ఆర్ ఐ శేషగిరిరావు టౌన్ సిఐ భాస్కర్ ఎస్బి సత్యనారాయణ ఎస్పీఎఫ్ సిబ్బంది నందు నాయక్ కృష్ణ ఉన్నారు.