Take a fresh look at your lifestyle.

దేశాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం

  • ఎస్ వీరయ్య,సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: దేశంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం భయానకమైన పరిస్థితులకు అవకాశం కల్పిస్తుందని ఎస్ వీరయ్య అన్నారు.విదేశీయులు అనే పేరుతో ఇప్పుడు ఎవరిని వేధించదలచుకుంటే వారిపై దాడులు మొదలు పెట్టిందని అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య మాట్లాడుతూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,బీహార్ లాంటి మరికొన్ని రాష్ట్రాల్లో ఈ దాడులు మొదలైనవని, ఇది దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందని అన్నారు.సుమారు 40,50 సంవత్సరాల నుండి ఆయా రాష్ట్రాల్లో నివసిస్తున్నప్పటికీ ఎవరినైతే వేధించాలనుకుంటున్నారో,ఎవరైతే బిజెపికి ఓట్లు వేయరని అనుకుంటున్నారో వారిని నువ్వు ఈ దేశ పౌరునివని లేదా పౌరురాలు అని రుజువు చేసుకో అని అంటున్నారు.ఇది చాలా ప్రమాదకరమైన వాతావరణం అన్నారు.రుజువు చేసుకోవడానికి ఏ ఆధారాలు కావాలో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుందని అన్నారు.అందులో ప్రధానంగా భర్త్ సర్టిఫికెట్ ఉండాలని,తనతో పాటు తన తల్లిదండ్రుల భర్త్ సర్టిఫికెట్లు కూడా ఉండాలంటున్నారని అన్నారు.మరి ఈ దేశంలో చదువురాని అత్యధికంగా కూలీలు,వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు,పేద కూలీలు,కౌలు రైతులు ఉన్న దేశం మనది.

మన తల్లిదండ్రుల సర్టిఫికెట్లు చూపించాలని అంటేనేవేధింపులు మొదలైనట్లు లెక్క.ఇప్పుడు ఇది ఒక సమస్యగా ఉంది.ఇప్పటికే అనేక రాష్ట్రాలలో బిజెపికి ఓట్లు వేయరనే కారణంతో వేల,లక్షల ఓటర్లను తొలగించారని ఇప్పుడు బీహార్ లో కూడా అదే జరుగు తుందని అన్నారు.బీహార్ లో ఓటర్ల లిస్టును అప్డేట్ చేస్తున్నా మంటూ ఈ పేరుమీద పెడుతున్న నిబంధనలు ప్రమాదకరమైనవి అని అన్నారు.దేశ పౌరులుగా రుజువు చేసుకోవడానికి బర్త్ సర్టిఫికేట్స్ లేనివారు ఇప్పటికే అస్సాంలో 19 లక్షల మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు.ఇప్పుడు బిజెపి ప్రభుత్వం బీహార్ లో చేస్తున్నది కూడా అదే తరహా ప్రయత్నమని అదే జరుగుతే ఇక్కడ కూడా 2 కోట్ల మంది ఓటర్ల జాబితా నుండి తొలగించబడతారని అన్నారు.ఇలా ఇది కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ ఓట్లు జరిగే రాష్ట్రాలలో ఇలాంటి విధానాలకు పాల్పడుతూ కొన్నిచోట్ల గెలవడానికి అనుకూల మైన వాతావరణం సృష్టించుకుని ఆ రకంగా విజయం సాధించారని అన్నారు.

అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పంటలు వేసే సీజన్ ప్రారంభ మైందని అన్నారు.రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉందని,యూరియా కోసం రైతులు క్యూలో నిలబడాల్సి వస్తుందని అన్నారు.పంట సీజన్ ప్రారంభంలోనే రైతులకు యూరియాను స్టాక్ పెట్టాల్సింది పోయి ఎందుకు ప్రభుత్వం అప్రమత్తంగా లేదని ప్రశ్నించారు.మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగుభూమి, పంటలు బాగా పెరిగాయి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఇన్ని లెక్కలు ఉన్నప్పుడు ఎంత యూరియా అవసరం పడుతుందో ప్రభుత్వం దగ్గర ఎందుకు లెక్కలు లేవని ప్రశ్నించారు.మే నెల కల్లా యూరియా స్టాక్ నిలువలు పెట్టాల్సి ఉండాలి కదా?ఎందుకు ప్రభుత్వం విఫలమైందని దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే రైతులకు యూరియాను అందుబాటులకు తేవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని అన్నారు.రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు,ఆదర్శ పాఠశాలలు రకరకాల గురుకుల పాఠశాలు విస్తరించాయని అన్నారు. గత టిఆర్ఎస్ పాలనలో గురుకుల పాఠశాలల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో ఆదిలాబాద్ జిల్లా, మరికొన్ని జిల్లాల్లో విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చి రాస్తారోకలు, ధర్నాలు చేసిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.నిన్నటికి నిన్న దేవరకొండలో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనారని అన్నారు.ఇప్పటికే అనేక మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ పేరుతో అనేక పాఠశాలల్లో చనిపోయారని కూడా అన్నారు.గురుకుల పాఠశాలల్లో అన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నామని చెప్తున్న అధికారులు ఎందుకు ఫుడ్ పాయిజన్ జరుగుతుందో ఆలోచించడం లేదని అన్నారు. గురుకుల పాఠశాలలోకి విలేకరులను గాని, విద్యార్థి సంఘం నాయకులను గాని, తల్లిదండ్రులను గాని అనుమతించరు.అన్ని తామే చూసుకుంటున్నం అంటున్నారు.మరి అన్ని రకాలుగా మీరు చూసుకుంటే ఫుడ్ పాయిజన్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయని,ఇది ప్రభుత్వం బాధ్యత రహతంగా ఉన్నట్లు కనబడుతుందని, పిల్లల పట్ల ఇలాంటి బాధ్యత రహితంగా ఉండడం వీల్లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.ముత్యంరావు, వై యాకయ్య,వేల్పుల కుమార స్వామి, మహేశ్వరి, ఎం.రామాచారిజిల్లా కమిటీ సభ్యులు మెండే శ్రీనివాస్, మేదరి సారయ్య నాయకులు ఆరెపల్లి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.